in

TAAPSI MUDDUPERU YEMITO TELUSA?

ఝుమ్మంది నాదం” చిత్రం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ తాప్సి పన్ను, ఈమెను ఇంట్లో వాళ్ళ నాన్న గారు ముద్దుగా” ఆలు ” అని పిలుచుకుంటారట, అలా ఎందుకు పిలుస్తారో తెలుసా? గ్లామర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చిన తాప్సి, అందులోనే గిరి గీసుకొని ఉండిపోకుండా, హిందీ లో “పింక్”, “బేబీ” “ముల్క్” వంటి విభిన్నమయిన చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించటమే కాదు, లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ కి కేర్ అఫ్ అడ్రస్ గ మారింది తాప్సి. చిన్నప్పటి నుంచి తాప్సి కి బంగాళా దుంప తో చేసిన వంటకాలు చాల ఇష్టమట.

బంగాళా దుంప తో ఏమి చేసిన ఇష్టంగా తినేసేవారట. ఇది గమనించిన వాళ్ళ అమ్మ గారు ఈమె కు ఉన్న ఆ బంగాళా దుంప పిచ్చి ని తగ్గించాలని, ఒక రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్ ,డిన్నర్ మూడు పూటల బంగాళా దుంప కూరలు వండించారట తాప్సి ఆనందంగా లాగించేసిందట. ఇలా ఎన్ని సార్లు తింటుందో చూద్దాం అనుకున్న వాళ్ళ అమ్మ గారు, మూడు రోజులు ఏక ధాటిగా బంగాళా దుంప తో చేసిన కూరలు వడ్డించటం ఈమె హ్యాపీగా లాగించటం జరిగి పోయింది. ఈమె కు ఉన్న బంగాళా దుంప పిచ్చి కి ఆమె అమ్మ గారు ఒక దండం పెట్టి, నీతో బంగాళా దుంప మానిపించటం నా వల్ల కాదే తల్లి, అని ఓటమి అంగీకరించారట.

అప్పటి నుంచి తాప్సి నాన్న గారు కూతురిని “ఆలు” అంటూ ముద్దుగా పిలుచుకునేవారట. ఒకే రకం వెజిటబుల్ ను ఇష్టం గ తిన్నా కూడా, ఒకే రకం పాత్రలకు కట్టుబడకుండా, సినిమా, సినిమా కు తన రేంజ్ ను పెంచుకుంటూ, తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు తాప్సి, ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తుకు వచ్చేది తాప్సియే. చాల గ్యాప్ తరువాత , ప్రస్తుతం “మిషన్ ఇంపాసిబుల్” అనే తెలుగు చిత్రంలో కూడా నటిస్తున్నారు తాప్సి.

rrr!

Shraddha Kapoor And Rohan Shrestha Break-Up After 4 Years Of Dating?