ప్రస్తుతం తెలుగు కంటే బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది తాప్సి.. అయితే ఈ చిన్నది బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బో తో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ ఇద్దరు కలిసిచట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఇటీవల మాథియాస్ తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేసింది తాప్సీ. ఆఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇద్దరు పెళ్లాడబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. వచ్చే ఏడాది వీరి పెళ్లి ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ వార్తలపై తాప్సీ మేనేజర్ స్పందించారు. తాప్సీకి ప్రస్తుతం పెళ్ళిచేసుకుని ఉద్దేశం లేదని ఆమె దృష్టి అంతా సినిమాలపైనే అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాప్సి హిందీలో రెండు మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులో కూడా ఈమె ఒక సినిమాను చేసేందుకు సైన్ చేసింది. కెరియర్ లో చాలా బిజీగా ఉన్న తాప్సీకి రిలేషన్ షిప్ వరకు ఓకే కానీ పెళ్లి ఆలోచన మాత్రం ఇప్పట్లో లేదని తెలుస్తుంది.