in

surya’s ‘Soorarai Pottru’ has achieved an unbelievable feat in imbd ratings!

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూరరై పొట్రు’. ‘ఆకాశం నీ హద్దురా’  పేరుతో తెలుగులో విడులైందిఈ చిత్రం. కరోనా కారణంగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్  ప్రైమ్ లో విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో చక్కటి ప్రేక్షకాదరణ పొందింది. తాజాగా షాంఘై  ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పనారోమా సెక్షన్ లో ప్రదర్శనకు కూడా ఎంపికయింది. ఇప్పుడు ఈ  సినిమా మరో అరుదైన రికార్డు సాధించింది.

అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ ‘ఐఎండీబీ’లో  ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక రేటింగ్ వచ్చిన 3వ సినిమాగా నిలిచింది ‘ఆకాశం నీ హద్దురా’. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDB)లో ఈ సినిమాకి 9.1 రేటింగ్ పాయింట్స్ దక్కడం విశేషం. వరల్డ్ లో టాప్-3లో, ఇండియాలో టాప్-1 లో నిలిచింది. ఈ రేటింగ్స్ లో ‘ది షావ్శాంక్’ సినిమా మొదటి స్థానంలో, ‘ది గాడ్ ఫాథర్’ రెండో స్థానంలో ఉన్నాయి. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో అపర్ణ బాలమురళి హీరోయిన్..

chef kaavali ani kalalu ganna actor dhanush!

akhil sends birthday wises to his real life queen Monal Gajjar!