in

surekha vani’s daughter fires on social media people!

తెలుగు సినీ న‌టి సురేఖ వాణి కూతురు సుప్రిత త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ లో ఓ పోస్ట్ చేసింది. ‘ఉన్న న్యూస్ చెప్పండి.. కొత్తగా క్రియేట్ చేయ‌కండి’ అంటూ మీడియాపై ఫైర్ అయ్యింది. ‘ఉన్న న్యూస్ చెప్పండి. కొత్తగా క్రియేట్ చేయ‌కండి. లేదంటే మీమ్మ‌ల్ని మీరు జ‌ర్న‌లిస్టుల‌మ‌ని చెప్పుకోవ‌డాన్ని, మీవి ప్రైమ్‌ న్యూస్ ఛానెల్స్ అని చెప్పుకోవ‌డాన్ని ఆపేయాలి. మీ రెవెన్యూ కోసం ఇత‌రుల ప్ర‌తిష్ఠ‌ను, వారి కెరీర్‌ ను దెబ్బ‌తీస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటు ప‌లు ప్ర‌క‌ట‌న‌ల్లో నటించిన సుప్రిత.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. అయితే ఈమె మీడియాపై ఆగ్రహం తెచ్చుకోవడానికి కారణం ఏమిటంటే.. ఇటీవ‌ల సురేఖ వాణి రెండో పెళ్లిపై మీడియాలో చాలా వార్తలొచ్చాయి. వాటిని సురేఖ‌ ఖండించింది. ఈ నేపథ్యంలోనే సుప్రిత ఇలా సంప్రదించింది.

stranger cheats rs 66 thousand bheeshma director venky kudumula!

hybrid pilla dominating chaithu in ‘love story’ promotions!