నటుడు అయిన వాళ్ళందరూ సూపర్ స్టార్ లు అయిపోరు,నటన పట్ల వారి అంకిత భావం, వారి నటన చాతుర్యం వారిని సూపర్ స్టార్లు గ జనం గుండెల్లో నిలుపుతుంది,అది ఒకరు చెపితే లేదా ఒకరు ఇస్తే వచ్చే స్థానం కాదు. రజనీకాంత్ సూపర్ స్టార్ గ ఎలా ఎదిగారు అనేందుకు, నటన పట్ల ఆయన అంకిత భావానికి ఒక చిన్న ఉదాహరణ. “చంద్రముఖి” నిర్మాణ సమయం లో జరిగిన ఒక సంఘటన.రాజ దర్బారు లో అందరి సమక్షంలో చంద్రముఖి ప్రియుడిని హతమార్చే సన్నివేశం షూట్ చేస్తున్నారు, చంద్రముఖి తన ప్రియుడితో కలసి తన్మయత్వంతో నర్తిస్తుంది, వాళ్ళ నాట్యానికి అనుగుణంగా తాళం వేస్తూ చంద్రముఖి ప్రియుడి తల నరికే ప్రయత్నం లో ఉన్న రజనీకాంత్ గారి చెవికి ఉన్న జూకా జారీ క్రింద పడిపోతుంది, అయిన కూడా తన నటన ఆపకుండా ఆ సీన్ అలాగే కంటిన్యూ చేసి అతని తల నరికివేసి,ఆ తరువాత చాల ప్రశాంతంగా తాళం వేస్తూ క్రింద పడిన జూకా ను తీసి చెవికి పెట్టుకుంటూ, క్రింద పడిన చంద్రముఖి ప్రియుడి తలను కసిగా కాలితో తన్నివేస్తారు రజనీకాంత్.జూకా క్రింద పడి నప్పుడు కట్ చెప్పబోయిన డైరెక్టర్ వాసు గారు రజని గారి నటనకు నిర్ఘాంతపోయి అలాగే చూస్తూ ఉండి పోయారు. జూకా ను ఎత్తి చెవికి పెట్టుకోవటం, క్రింద పడిన తలను తన్నడం ఇవన్నీ రజని తన సొంత ఆలోచన తో ఇన్వొల్వెమెంట్ తో చేసారు. నరికివేయపడ్డ చంద్రముఖి ప్రియుడి తలను కాలితో తన్నడం వలన ఆ రాజు ఎంతటి క్రూరుడో, దాని వలన చంద్రముఖి మనన్సు ఎంత క్షోభించిందో అనే స్ట్రాంగ్ పాయింట్ ను ఎస్టాబ్లిష్ చేసారు.అందుకే రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యారు,తన కండలు చూపించటం వలనో, తాను చేసే సరదా జిమ్మిక్స్ వలన కాదు.నటన పట్ల ఆయనకు ఉన్న అంకితభావమే ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చింది.
Forgot password?
Enter your account data and we will send you a link to reset your password.
Your password reset link appears to be invalid or expired.
Log in
Privacy Policy
To use social login you have to agree with the storage and handling of your data by this website.
AcceptAdd to Collection
No Collections
Here you'll find all collections you've created before.