in

super star mahesh babu creates new record on twitter!

సూపర్ స్టార్ మహేష్ బాబు రోజు రోజుకు అశేష ప్రేకకాదరణ పొందుతున్నాడు. ముఖ్యంగా అతనిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ పోతుంది. తాజాగా మహేష్ కు ట్విట్టర్ లో 11 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చి చేరారు. దీంతో ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరో గా మహేష్ రికార్డ్ సాధించారు.

మహేష్ సాధించిన ఈ రికార్డ్ పట్ల సంతోషం వ్యక్తంచేసిన మహేష్ ఫ్యాన్స్ #11millionmaheshians అనే హ్యష్ ట్యాగ్ ను సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు. మహేష్‌కు ఇన్ స్టాగ్రాం లో 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, ఫేస్ బుక్ లో 5.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సర్కారు వారి పాట అనే చిత్రంతో మహేష్ బిజీగా ఉండగా, ఈ సినిమా జనవరి నుండి షూటింగ్ జరుపుకోనుంది..

DIRTY HARI COLLECTS RS 1 CR IN 24 HOURS!

Pawan Kalyan – Rana movie titled as ‘Billa Ranga’!