in

DIRTY HARI COLLECTS RS 1 CR IN 24 HOURS!

క కొత్త ఏటీటీ యాప్‌లో శుక్ర‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ సినిమాను రిలీజ్ చేస్తే.. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 91 వేల వ్యూస్ వ‌చ్చాయి. ఈ చిత్రానికి టికెట్ రేటు 120 రూపాయ‌లు పెట్టారు. అంటే ఒక్క రోజు వ్య‌వ‌ధిలో కోటి రూపాయ‌ల‌కు పైగానే వ‌సూళ్లు వ‌చ్చాయ‌న్న‌మాట‌. సినిమా చూస్తే త‌క్కువ బ‌డ్జెట్లోనే పూర్తి చేసిన‌ట్లే ఉంది. ఆన్ లైన్ రిలీజ్ కాబ‌ట్టి ప‌బ్లిసిటీకి కూడా పెద్ద‌గా ఖ‌ర్చు లేదు. తొలి రోజే బ‌డ్జెట్ కంటే ఎక్కువే వెన‌క్కి వ‌చ్చి ఉంటే ఆశ్చ‌ర్యం లేదు. ఐతే ఈ సినిమాను రిలీజ్ చేసిన కొత్త ఏటీటీ యాప్ మాత్రం వ్యూయ‌ర్స్‌ను ఏడిపించేసింది. పేమెంట్ చేశాక సినిమా స్ట్రీమ్ కాలేదు. డ‌బ్బులు క‌ట్ అయ్యాయి సినిమా రావ‌ట్లేదంటూ వ్యూయ‌ర్స్ ల‌బోదిబోమ‌న్నారు. యూజ‌ర్లు ఎక్కువైపోవ‌డంతో స‌ర్వ‌ర్లు డౌన్ అయ్యాయ‌ని మెసేజ్‌లు పెట్టారు. శ‌నివారం మ‌ధ్యాహ్నానికి సినిమా ప్లే అయింది.

First thing I told my trainers, ‘no steroids’ : thapsi

super star mahesh babu creates new record on twitter!