in

SUNIL TRYING HIS LUCK AS HERO AGAIN!

సునీల్ మళ్లీ కమెడియన్‌గా టర్న్ తీసుకున్నప్పటికీ గతంలో మాదిరిగా ప్రేక్షకులను అలరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వచ్చిన ‘కలర్ ఫోటో’లో విలనిజం చూపించినా అంతగా ఆకట్టుకోలేకపోయారు. కమెడియన్‌ అయిన సునీల్‌ను ప్రతినాయకుడిగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. అయితే కమెడియన్‌గా ఇప్పుడు ఆయనకు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి.

ఈ తరుణంలోనే సునీల్ మళ్లీ హీరోగా నటించబోతున్నాడన్న వార్త ఫిల్మ్‌ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. కన్నడలో విజయం సాధించిన ‘బెల్‌బాటమ్’ సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారట. కామెడీతో పాటు స్పై తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా నటించారు. ఈ రీమేక్ మూవీలో సునీల్‌ను హీరోగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది

BIG BOSS BEAUTY DIVI HITS A JACKPOT!

prabhu deva getting married for the second time?