in

BIG BOSS BEAUTY DIVI HITS A JACKPOT!

తెలుగు బిగ్‌బాస్-4లో సందడి చేసిన దివికి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. దసరా రోజు సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్‌లో దివి ఎలిమినేట్ అయిన బిగ్‌బాస్ హౌస్‌ను వీడింది. ఆ ప్రత్యేకమైన ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన దివి ప్రేక్షకుల హృదయాలను మాత్రం వదిలి వెళ్లలేదు. ఆ సందర్భంగా దివికి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని కోరగా హీరో కార్తికేయను సమంత కోరగా ఆయన కూడా సరేనన్నారు.

చాలా సినిమాల్లో చిన్నచిన్న క్యారెక్టర్లు చేసిన దివి.. బిగ్‌బాస్‌ తర్వాత హీరోయిన్ అవకాశాలపై ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. బయటకు వచ్చిన తర్వాత కూడా దివికి మంచి ఫాలోయింగ్ దక్కింది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కోసం తెరకెక్కిస్తున్న రెండు వెబ్ సిరీసుల్లో దివికి ఆఫర్లు వచ్చాయి. దీంతో పాటు మరో రెండు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తలుపు తట్టినట్లు సమాచారం.

Rakul Preet Singh Shares Her First Shooting Experience!

SUNIL TRYING HIS LUCK AS HERO AGAIN!