in

sunil is back as a hero again!

హీరోయిజం పక్కన పెట్టేసిన సునీల్‌కు కమెడియన్‌గా అరకొర ఛాన్సులే వచ్చాయి. రూమ్‌మేట్‌ త్రివిక్రమ్‌ అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో ఆఫర్స్ ఇచ్చినా.. ఇవేవీ సునీల్‌కు పేరు తీసుకురాలేదు. హాస్య నటుడిగా పూర్వవైభవం చూడాలనుకున్న సునీల్‌కు చుక్కెదురైంది. ఈ క్రమంలో… కమెడియన్‌ కాస్తా.. విలన్‌గా మారాడు. ఇలా ప్రతి నాయకుడిగా నటించిన డిస్కోరాజా డిజాస్టర్‌ కావడంతో.. సునీల్‌ పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌ కాలేదు. మరో కమెడియన్ సుహాస్‌ హీరోగా నటిస్తున్న ‘కలర్‌ ఫొటో’లో ప్రతినాయకుడిగా నటిస్తూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు సునీల్‌.

కమెడియన్‌గా.. హీరోగా.. విలన్‌గా కనిపించిన సునీల్‌ మరోసారి కథానాయకుడు అవతారమెత్తాడు. హాస్య నటుడిగా ఒకటీ అర ఆఫర్సే రావడంతో.. హరీష్‌ శంకర్ ఇచ్చిన హీరో ఛాన్స్‌ను ఉపయోగించుకుంటున్నాడు. హరీష్‌ రాసుకున్న కథకు సునీల్‌ను హీరోగా సెలెక్ట్‌ చేశాడు. సినిమాకు ‘వేదాంతం రాఘవయ్య’ అన్న టైటిల్‌ పెట్టాడు. తెలుగు సినిమా బ్లాక్‌అండ్‌ వైట్‌ రోజుల్లో .. దర్శకనిర్మాత వేందాంత రాఘవయ్య దేవదాసు.. అనార్కలి.. చిరంజీవులు వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు. ఆ పేరునే టైటిల్‌గా ఎందుకు పెట్టారో తెలియాల్సి ఉంది. హరీశ్‌ దర్శకత్వంలో గద్దలకొండ గణేష్‌ నిర్మించి 14 రీల్స్‌ ప్లస్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది.

3 surprises for pawan fans tomorrow!

pawan kalyan gets emotional about his fans death!