in

sunil and saloni all set to repeat maryada ramanna combination!

మెడియన్ నుండి హీరోగా..విలన్ గా కూడా పలు సినిమాలు చేశాడు సునీల్. ఆయన హీరోగా చేసిన చిత్రాలలో చెప్పుకోదగ్గ మూవీ ఏదీ అంటే మర్యాద రామన్న అనే చెప్పాలి. ఆ మూవీ వచ్చి పదేళ్లు అయ్యింది. ఈ మూవీని దర్శకధీరుడు రాజమౌళి రూపొందించాడు. ఆ చిత్రంలో సునీల్ కి జంటగా సలోనీ నటించింది. కాగా ప్రస్తుతం సునీల్..సలోనీల సినీ కెరీర్ ఆశించదగ్గట్టు ఏం నడవట్లేదు. కాగా హీరోయిన్ సలోనిని జనాలు మరిచి పోయే పరిస్థితి వచ్చింది. సునీల్ కమెడియన్ గా సినిమాలు చేస్తున్నా పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ మరోసారి జంటగా కనువిందు చేయనున్నారట.

దర్శకుడు వీఎన్ ఆధిత్య సునీల్..సలోనిలను కలిపేందుకు ముందుకు వచ్చాడు. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సునీల్ హీరోగా వీఎన్ ఆధిత్య దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ అయింది. సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వకుండానే షూటింగ్ ను చకచక జరుపుతున్నారు. ఈ సినిమాలో సునీల్ కు జోడీగా సలోనిని నటింపజేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిది హిట్ పెయిర్ అవ్వడంతో పాటు హీరోయిన్ పాత్రకు ఆమె అయితే బాగుంటుందనే అభిప్రాయంతో దర్శకుడు ఆధిత్య ఆమెను ఎంపిక చేశాడనే వార్తలు వస్తున్నాయి.

Chandini Chowdary was first choice for ‘Kumar 21F’ and ‘Pataas’!

kriti sanon to play sita in ‘adhipurush’?