in

Chandini Chowdary was first choice for ‘Kumar 21F’ and ‘Pataas’!

సుహాస్ హీరోగా వచ్చిన కలర్ ఫోటో చిత్రం చాందిని చౌదరి మంచి పేరును తీసుకువచ్చింది. ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. అయితే ఈ సినిమా సక్సెస్ తో వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, తన కెరీర్‌కు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సినీ కెరీర్లో అందరిలాగే తానూ కూడా సినీ కష్టాలను చూసినట్టుగా వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికి తనకి ఆశించినంతగా పేరు తీసుకురాలేదని చెప్పుకొచ్చింది.

అలాంటి సమయంలో కలర్‌ఫొటో చిత్రం తనకి మాంచి విజయాన్ని అందించిందని వెల్లడించింది. అయితే ఆ సినిమాకు ముందు కొన్ని ప్రాజెక్ట్‌లు తన వద్దకు వచ్చినట్టుగా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఓ ప్రముఖ నిర్మాత దగ్గర తానూ కాంట్రాక్ట్‌లో ఉండడంతో రెండేళ్లపాటు వేరే సినిమాల్లో నటించే అవకాశం లేకుండా పోయిందని చాందిని చెప్పుకొచ్చింది. అలా తానూ కుమారి 21F‌, పటాస్ చిత్రాలను కోల్పోవాల్సి వచ్చిందని వెల్లడించింది. మొత్తానికి తన కష్టానికి కలర్ ఫోటో చిత్రం తగిన ప్రతిఫలాన్ని ఇచ్చిందని వెల్లడించింది చాందిని.

DIRECTOR ‘Tharun Bhascker Dhaassyam’ GARI PERU VENAKA UNNA RAHASYAM!

sunil and saloni all set to repeat maryada ramanna combination!