in

kriti sanon to play sita in ‘adhipurush’?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా రూపొందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే సంవత్సరం సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే… ఇందులో రాముడు ప్రభాస్ అయితే.. రావణుడు సైఫ్ ఆలీఖాన్. అయితే… సీత పాత్ర ఎవరు పోషించనున్నారు అనేది ఫస్ట్ నుంచి ఆసక్తిగా మారింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ సరసన నటించిన అనుష్కనే సీత పాత్ర పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఆతర్వాత బాలీవుడ్ బ్యూటీ అయితే… బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు అంటూ టాక్ వినిపించింది. రాథేశ్యామ్ మూవీలో నటిస్తున్న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అనుష్క, పూజా హేగ్డే.. ఇలా కొంత మంది పేర్లు వార్తల్లోకి వచ్చినప్పటికీ.. వీళ్లేవరు కాకుండా మరో తారను ఫిక్స్ చేసినట్టు తెలిసింది.ఇంతకీ.. ఎవరంటారా..? మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే సినిమాలో నటించిన కృతిసనన్ ను ఆదిపురుష్ మూవీలో సీత పాత్రకు ఎంపిక చేసారని తెలిసింది. త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారని సమాచారం. ఇదే కనుక నిజమైతే… కృతిసనన్ కి బంపర్ ఆఫరే.

sunil and saloni all set to repeat maryada ramanna combination!

DYNAMIC HERO RANA DAGGUBATI IN BLOODSHOT TELUGUSWAG EDITS