in

stage set for the muhurtham of ‘f3’!

రుస హిట్లతో మంచి జోరు మీదున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా అనీల్ కెరియర్లో మైలు రాయిగా నిలిచింది. అయితే ఇప్పుడుఈ సినిమా హడావిడి పూర్తయింది. మహేష్ తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అటు అనీల్ కూడా ‘ఎఫ్3’ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉండబోతున్నారని మొదటినుంచి వార్తలు వస్తున్నాయి.

అయితే ముందుగా ఈ సినిమాలో వెంకటేష్ వరుణ్ తేజ్ తో పాటు మాస్ రాజా రవితేజ కూడా నటిస్తున్నాడని ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఫైనల్ స్క్రిప్టుకు వెంకీ.. వరుణ్ తేజ్ లు ఓకే చెప్పారు. డిసెంబరు 14న ఈ సినిమా షూటింగ్ షురూ కానుంది. మొదటి షెడ్యూల్ లోఈ ఇరువురు అగ్ర నటులు పాల్గొంటారని చెబుతన్నారు. దేవీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే మేలో థియేటర్లలో సందడి చేసేలా ప్లాన్ చేస్తున్నారట

ram created a phenomenal record on youtube!

kajal’s honeymoon budget becomes a hot topic!