in

ram created a phenomenal record on youtube!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన ప్లాప్ చిత్రం ‘గణేష్’తో తాజాగా భారీ రికార్డును సృష్టించారు. ఈ చిత్రం యొక్క హిందీ డబ్బింగ్ వెర్షన్ కు యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీని బట్టి ఉత్తర భారతీయ సినీ ప్రేమికులలో రామ్ కు ఏ రేంజ్ ఆదరణ ఉందో అర్ధమవుతుంది. కాగా గణేష్ మూవీ 100 మిలియన్ల ఫీట్‌ తో, రామ్ ఖాతాలో అరుదైన రికార్డ్ ఒకటి చేరింది. ఇప్పటివరకూ రామ్ సినిమాల్లో 6 సినిమాలకు హిందీ యూట్యూబ్‌ చానెల్స్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. రామ్ తప్ప, మరే ఇతర టాలీవుడ్ హీరోకు ఈ రోజు వరకు 100 మిలియన్ వ్యూస్ నమోదు చేసిన ఆరు సినిమాలు లేవు. మొత్తానికి రామ్ ఈజ్ యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రేజేన్స్ కి ఉత్తర భారతదేశంలో భారీ అభిమానులు క్రియేట్ అయినట్టు ఉన్నారు. ఇక గణేష్ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

rana clears the rumors about mihika’s cine entry!

stage set for the muhurtham of ‘f3’!