in

srimanthudu INSPIRED FROM BALAYYA’S MOVIE!

దేళ్ళ క్రితం వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ పక్కనే వచ్చి… నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్స్ తో సతమతమవుతున్న తరుణంలో దర్శకుడు కొరటాల శివ .. ‘శ్రీమంతుడు’ చిత్రంతో మహేష్ ను ఆదుకున్నాడు. కమర్షియల్ గానే కాదు ఈ చిత్రాన్ని చూసాక ఎంతో మంది సెలబ్రిటీలు తమ సొంత ఊర్లను దత్తత తీసుకున్నారు.

అయితే ఇంత పాపులర్ అయిన ఈ చిత్రం కథని మన బాలకృష్ణ ఎప్పుడో తీశాడు. నిజం … కళా తపస్వి కె.విశ్వనాథ్ గారి డైరెక్షన్లో 1984 జూలై 27 విడుదలైన ‘జననీ జన్మభూమి’ చిత్రం పెద్దగా ఎవ్వరికీ గుర్తుంది ఉండదు. బాలకృష్ణ హీరో కాగా సుమలత హీరోయిన్. ఆ చిత్రం కథ కూడా ‘శ్రీమంతుడు’ లానే ఉంటుంది. అయితే ఆ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు కనుక ప్లాప్ గా మిగిలింది.

‘జననీ జన్మభూమి’ చిత్రంలో రమేష్(బాలకృష్ణ) అనే కుర్రాడు పద్మిని (సుమలత) ను ప్రేమించి ఆమె కారణంగా సొంత ఊరు తెలుసుకుని ఆ ఊరికి వెళ్ళి.. అక్కడి సమస్యలు.. దుర్మార్గుల చేష్టలను అరికడతాడు. అప్పుడు సక్సెస్ కాని లైన్ ని కమర్షియల్ ఎలెమెంట్స్ నింపి కొరటాల … ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు తీశాడు. ఈ విషయాన్ని కొరటాల కూడా అప్పటి అద్బుతమైన లైన్ ని .. ఇప్పటి జనానికి నా స్టైల్ లో గుర్తు చెయ్యాలి అనిపించింది అని చెప్పుకొచ్చాడు.

Sam’s interesting comments on chay’s pillows!

STUNNING NIVETHA PETHURAJ!