in

sri devi’s daughter in raghavendra rao’s ‘pelli sandhadi’!

ర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 1996లో శ్రీ‌కాంత్ హీరోగా తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.  స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అశ్వినీద‌త్‌, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీకి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారు. పెళ్లిసందD పేరుతో తీస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనిఉంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఇందులో ఇద్ద‌రు క‌థ‌నాయిక‌ల‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.  అతిలోక సుంద‌రి శ్రీదేవితో క‌లిసి ఎన్నో అద్భుత చిత్రాలు తెర‌కెక్కించిన రాఘ‌వేంద్ర‌రావు ఇప్పుడు ఆమె చిన్న కూతురు ఖుషి క‌పూర్‌ని పెళ్లి సంద‌డిలో హీరోయిన్‌గా అనుకుంటున్నారట‌. ఇప్పటికే ఖుషీ కపూర్ తో డిస్కషన్స్ కూడా జరిగినట్టు తెలుస్తోంది.  మ‌రో హీరోయిన్‌గా మల‌యాళ బ్యూటీ మాళ‌విక నాయ‌ర్‌ని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.  దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

director sukumar’s crazy plan for pushpa!

adivi sesh to replace vishwak sen in hit sequel?