
నేచురల్ స్టార్ నాని, ప్రశాంత్ తిపిర్నేని నిర్మాతలుగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రుహని శర్మ, హరి తేజ, భాను చందర్, మురళి శర్మ, రవి వర్మ, బ్రహ్మాజీ నటించారు. ఈ క్రైమ్ డ్రామాకి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక ఈ మూవీని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు.