in

director sukumar’s crazy plan for pushpa!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం పుష్ప. ఈ చిత్రంలో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి ఫారెస్ట్ లో స్టార్ట్ అయ్యింది. అయితే… ఈ సినిమా స్టార్ట్ అయ్యింది కానీ.. విలన్ ఎవరు అనేది మాత్రం ఖరారు కాలేదు. తమిళ హీరోల పేర్లు తెర పైకి వచ్చాయి కానీ.. ఎవరూ ఖరారు కాలేదు. ఆతర్వాత బాలీవుడ్ స్టార్ హీరో ని సెలెక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి.అయితే.. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 9 మంది విలన్లు ఉన్నారట. అందులో సునీల్‌కీ ఓ పాత్ర ద‌క్కింద‌ట‌. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సునీల్ ఆతర్వాత హీరోగా మారడం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కోరాజా మూవీలో సునీల్ విలన్ గా నటించాడు. ఈ సినిమా సునీల్ కి అంతగా ప్లస్ కాలేదు కానీ… ఇటీవల వచ్చిన కలర్ ఫోటో మూవీలో సునీల్ విలన్ గా నటించారు. ఈ మూవీ సునీల్ కి మంచి పేరు తీసుకువచ్చింది.

DYNAMIC HERO RANA DAGGUBATI IN BLOODSHOT TELUGUSWAG EDITS

sri devi’s daughter in raghavendra rao’s ‘pelli sandhadi’!