in

Sreeleela to play lead opposite Sidharth Malhotra ‘Mitti’!

ప్రస్తుతం టాలీవుడ్లో మంచి రైజింగ్ మీద ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పూజా హెగ్డే డౌన్ అయిపోయాక నంబర్ వన్ హీరోయిన్ స్థానానికి శ్రీలీల గట్టి పోటీదారుగా మారింది. ఆల్రెడీ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్‌తో ‘గుంటూరు కారం’ చేసిన శ్రీలీల.. దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు నితిన్‌తో ‘రాబిన్ హుడ్’లోనూ నటిస్తోంది. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజతోనూ సినిమాకు ఓకే చెప్పింది..

ఇలా మంచి ఊపులో సాగుతున్న శ్రీలీల కెరీర్.. బాలీవుడ్‌ వైపు కూడా టర్న్ తీసుకుంటోంది. ఆల్రెడీ హిందీలో ‘దిలేర్’ అనే ఓ చిన్న సినిమా చేస్తోంది శ్రీలీల. ఐతే ఇప్పుడు బాలీవుడ్లో ఓ పెద్ద ఆఫరే ఆమె పట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ అప్ కమింగ్ స్టార్లలో ఒకడైన సిద్దార్థ్ మల్హోత్రా సరసన శ్రీలీల నటించబోతోందట. బల్వీందర్ సింగ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘మిట్టి’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలిసింది. ఇదొక యాక్షన్ టచ్ ఉన్న ఫ్యామిలీ డ్రామా అని సమాచారం..!!

Thangalaan!

Harish Shankar blames Sekhar Master for dance moves!