in

Director Anil Ravipudi to turn hero?

అపజయం ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావి పూడి. మొదటి సినిమా ‘పటాస్’ నుంచి తెరవెనక హీరోగా  సక్సెస్ ఫుల్ జర్నీ చేసాడు. F2, F3, భగవంత్ కేసరి ఇలా ఏ ప్రాజెక్ట్ చేసినా అది పక్కా హిట్. ప్రజంట్  వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. వెంకటేష్ తో చేయబోయే సినిమా కంప్లీట్ చేసి నటుడిగా మారనున్నాడని టాక్. హా ఎదో  సహాయక పాత్ర అనుకున్నారా? కాదు హీరోగానే ఎంట్రీ ఇవ్వనున్నాడు.

తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్ ని, తన స్టైల్ ని స్క్రీన్ మీద చూపించి, తాను కూడా  హీరో మెటీరియల్ అనిపించుకోవాలని తాపత్రయ పడుతున్నాడట. అనిల్ లో మంచి యాక్టర్ ఉన్న సంగతి కొన్ని ఈవెంట్లలో బయటపడింది. హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అనిల్ రావిపూడిని హీరోగా పరిచయం  చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ మూవీలో అనిల్ రావి పూడి కేవలం హీరో మాత్రమే అని, దర్శకుడు వేరేవాళ్లని సమాచారం..!!

keerthy Suresh: I’m the most trolled south actress

Thangalaan!