ఈసినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమానికి కూడా శ్రీలీల హాజరైంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తన కాల్షీట్లో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల శ్రీలీల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది. అయితే శ్రీలీల స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయంపై ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు..
విజయ్‌తో రష్మిక జోడీ కట్టనుందన్న వార్తలు విన్న నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ ఫేవర్ జంటను మళ్లీ ఆన్‌స్క్రీన్ పై చూడబోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట మూడోసారి ముచ్చటగా వెండితెరపై సందడి చేస్తే చూడాలని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నామంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజం కావాలి దేవుడా అంటూ అప్పుడే దేవుడిని కాకా పట్టడం కూడా షురూ చేశారు..!!