సినీ పరిశ్రమలో త్రిష అడుగుపెట్టి 21 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వన్నె తగ్గని అందంతో ప్రేక్షకులను ఇప్పటికీ ఆమె కట్టిపడేస్తోంది. హీరోయిన్ గా ఇప్పటికీ తన సత్తాను చాటుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయంటే త్రిష డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు త్రిష గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లాడబోతోందనేదే ఆ వార్త.
గతంలో ఓ సినిమా సందర్భంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని చెపుతున్నారు. ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది వేచి చూడాలి. మరోవైపు గతంలో త్రిషకు ఓ వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వారి బంధం పెళ్లి వరకు వెళ్లలేకపోయింది..!!