in

Sreeleela is performing a special song in Pushpa 2: The Rule!

పుష్ప కోసం సమంత స్థానంలో శ్రీలీల
పుష్ప పార్ట్ 1 లో సమంతఅంటావా పాట చేసింది. ఈ సాంగ్ సినిమా క్రేజ్ ని పెంచి, మంచి హిట్ అయ్యింది. సామ్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చింది ఈ పాట. దీంతో సెకండ్ పార్ట్ లో కూడా ఇలాంటి ఒక ఐటెం సాంగ్ పెట్టారు సుకుమార్. దేవిశ్రీ  పాట కూడా రెడీ చేసారు. కానీ హీరోయిన్ కన్ఫర్మ కాక ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంది. ఐటెం సాంగ్ కోసం సమంతని సంప్రదిస్తే నో చెప్పింది. డిసప్పాయింట్ అయిన టీమ్ జాన్వీ కపూర్, త్రిప్తి దిమ్రి, దిశాపటాని పేర్లు పరిశీలించారు కుదరలేదు..

శ్రీలీల ను ఐటెం సాంగ్ కు ఫిక్స్ చేసిన పుష్ప టీమ్
చివరికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ చేస్తోందని వార్తలు వచ్చాయి. కానీ శ్రద్దా కపూర్ కూడా ఈ పాటకి ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయటం, డేట్స్ కూడా చాలా తక్కువ ఇవ్వటంతో సుకుమార్ చివరికి శ్రీలీల వైపు మొగ్గు చూపారని సమాచారం. ఫైనల్ గా పుష్ప 2 లో శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తోంది. అసలు మొదట ఈ పాట కోసం శ్రీలీలని సంప్రదించారు. వరుస డిజాస్టర్లతో ఉన్న శ్రీలీల ఈ ఆఫర్ కి నో చెప్పింది. కెరియర్ డౌన్ లో ఉన్నప్పుడు ఐటెం సాంగ్స్ లో నటిస్తే వరుసగా అలాంటి ఆఫర్స్ వస్తాయని భయపడి తిరస్కరించింది. తిరిగి తిరిగి చివరికి మళ్ళీ శ్రీలీల దగ్గరికి టీమ్ వెళ్ళింది..!!

shraddha kapoor almost finalized for Pushpa 2 item song!

Regina Cassandra interesting comments on Bollywood!