in

Sonu Sood’s sensational comments on Chandrababu Naidu!

త ఏడాది లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేస్తూ వస్తున్నాడు. రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోశించినా రియల్ లైఫ్‌లో మాత్రం అందరిచేత నిజమైన హీరో అనిపించుకున్నాడు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుపై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సవాళ్లు, పరిష్కారాలు అంశాలపై చంద్రబాబు నాయుడు నేఅడు వర్చువల్ సమావేశం నిర్వహించారు.

అయితే ఈ సమావేశంలో పాల్గొన్న సోనూసూద్ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను తాను ప్రత్యక్షంగా చూశానని, పోరాటంలో మా ఇద్దరి ఆలోచనలు కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు లాంటివి అని, తన భార్య కూడా ఏపీకి చెందిన వ్యక్తి కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సోనూ అన్నారు.

natural star Nani’s ‘Meet Cute’ to have five heroines!

Vijay Sethupathi in Jr NTR and Prashanth Neel film?