in

Singer Sunitha Into New Business With Her Husband!

గాయని సునీత ఆంటే తెలియని వారుండరు. మంచి గాత్రంతో పాటు ఆకట్టుకునే అందం కూడ ఆమె సొంతం. ఈమెకు యువతలో చాలామందే ఫాన్స్ ఉన్నారు.  ఇటీవలే రెండవ వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది ఈమె. సునీత సెకండ్ మ్యారేజ్ పట్ల భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయినా సునీత అవేవీ పట్టించుకోకుండా తాను రైట్ అనుకున్నదే చేశారు. ఇప్పుడు భర్త రామ్ అందిస్తున్న ప్రోత్సాహంతోనే ఆమె కెరీర్లో మరొక అడుగు ముందుకు వేస్తోంది. ఇన్నాళ్లు గాయనిగానే అలరించిన ఆమె ఇకపై అభినయంతోనూ ఆకట్టుకోనుంది.

ఆమె భర్త రామ్ డిజిటల్ రంగంలోనే ఉన్నారు.  వెబ్ సిరీస్, షోస్ చేస్తూ ఉంటారు. ఆయన ఛానెల్ కూడ బాగా పాపులర్.  ఆయనే ఇప్పుడు సునీతతో ఒక వెబ్ సిరీస్ నిర్మించనున్నట్టు సమాచారం అందుతోంది.  సునీత కూడ ఇందుకు సుముఖంగానే ఉందట. గతంలో సునీతకు అడపాదడపా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె వాటిని రిజెక్ట్ చేసింది.. సినిమాలు చేయమని బలవంతపెట్టేవారు. వాళ్ళ కోరిక ఇన్నాళ్లకు తీరనుంది. భర్త నిర్మించబోయే వెబ్ సిరీస్లో సునీతదే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది.  కొందరైతే సునీత డిజిటల్ ఎంట్రీ పట్ల కాస్త షాకవుతున్నారు కూడ.

Sreenu Vaitla to direct akkeneni Akhil?

sai pallavi rocks it with ‘Saranga Dariya’!