in

Shruti Haasan recalls being called ‘unlucky’ and ‘iron leg’!

బ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంది. అయితే తాజా ఓ ఛానల్ కు ఇంటర్యూ ఇచ్చింది అమ్మడు. తాను సొంతంగా పైకి వచ్చానని, ఇండస్ట్రీలో అవకాశాల కోసం అమ్మ, నాన్న ఎవరికీ ఫోన్ చేసి రికమండ్ చేయలేదని హీరోయిన్ శృతి హాసన్ తెలిపింది. తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇండస్ట్రీలో ఎంట్రీ మాత్రమే ఇవ్వగలదని, నిరూపించుకోవాలసింది మాత్రం తానేనని పేర్కొంది. మనం పడే కష్టం కెరీర్ కు ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతానని, ఛాలెంజ్ లేకపోతే ముందుకు సాగలేమని చెప్పుకొచ్చింది శృతి హాసన్.

ఇక టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడిన శృతి గబ్బర్ సింగ్ ముందు వరకు తనని తెలుగులో ఐరన్ లెగ్ అని పిలిచేవారని పేర్కొంది. అయినా ధైర్యం చేసి పవన్, హరీష్ శంకర్ నాకు అవకాశం ఇవ్వడంతో.. నా బండి యూటర్న్ తీసుకుందని, ఆయన నాకు చాలా లక్కీ అంటూ తెలిపారు. బన్నీ, చరణ్ గురించి భారతదేశంలో అందరూ పొగుడుతుంటే ఇది మనకు ఎప్పుడో తెలుసు కదా అనిపిస్తుందని శృతి చెప్పొకొచ్చింది..ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని.. తను నిజంగా డార్లింగ్ ఏ అంటూ తెలిపింది. ఇక నాగచైతన్య తో పని చేసినందుకు ఎంతో సంతోష పడుతున్నాను అని.. ఎప్పుడో ప్రేమమ్ సినిమా చేశామని శృతి చెప్పుకొచ్చారు.

‘andhrawala’ fatt kannadiga hit!

senior actress shilpa shetty and tabu gets injured!