in

rajinikanth to romance milky beauty in his next?

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమాను షూటింగ్‌ను మొద‌లుపెట్టేందుకు జోరుగా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ వారంలోనే సినిమా సెట్స్‌పైకిరానుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బీస్ట్‌, డాక్ట‌ర్ సినిమాల ఫేమ్ నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నా రజనీకాంత్ మినహా మిగిలిన నటీనటుల వివరాల్ని చిత్ర యూనిట్ వెల్లడించలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌కు జోడీగా న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది కోలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది..

ఆ ల‌క్కీఛాన్స్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు ద‌క్కిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే త‌మ‌న్నాను క‌లిసిన దిలీప్‌కుమార్ ఆమెకు క‌థ‌ను వినిపించిన‌ట్లు తెలిసింది. ర‌జ‌నీకాంత్ సినిమా కావ‌డంతో త‌మ‌న్నా జైల‌ర్‌లో న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఆగ‌స్ట్ 15 నుంచి త‌మ‌న్నా ఈ సినిమా షూటింగ్‌లో భాగం కావ‌బోతున్న‌ట్లు స‌మాచారం. జైల‌ర్‌లో ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. న‌ర‌సింహా కాంబినేష‌న్ ఈ సినిమాతో మ‌ళ్లీ కుద‌ర‌డంతో దక్షిణాది ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది..!!

amala paul aims to do only romantic movies next!

‘andhrawala’ fatt kannadiga hit!