మా అమ్మా నాన్నలు విడిపోవడం గురించి మాట్లాడాల్సి వస్తే నేను ఉద్వేగానికి గురవుతా. ఒకరితో ఒకరికి పొసగనపుడు వేరుగా ఉండటమే సరైందని నేను భావిస్తా. వాళ్లిద్దరూ మా తల్లిదండ్రులుగా గొప్పగా తమ బాధ్యతను నిర్వర్తించారు. నేను ఎక్కువగా నాన్నతో గడిపాను. అమ్మ తన బాధ్యతగా ఏం చేయాలో అది చేసింది. విడాకులు తీసుకోవడం వల్ల ఇద్దరికీ మంచే జరిగింది. వ్యక్తిగతంగా వాళ్లిద్దరూ ఉత్తమమైన వాళ్లే.
కానీ ఇద్దరు ఉత్తములు కలిసి ఆనందంగా జీవించగలరనేమీ లేదు..నిజానికి వాళ్లు కలిసి ఉన్నప్పటి కంటే విడిపోయాక ఎక్కువ సంతోషంగా ఉన్నారు. మా అమ్మ, నాన్న విడిపోయిన సమయానికి నాది చిన్న వయసు. అప్పుడు బాధ పడ్డా సరే.. తర్వాత వాళ్ల నిర్ణయం సరైందని అర్థం చేసుకున్నా అని శ్రుతి చెప్పింది. ఇటీవలే క్రాక్ సినిమాతో తెలుగులో మంచి విజయాన్నందుకున్న శ్రుతి.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ లాంటి భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే..