స్టార్ హీరోల సినిమాలకు ఆమెను అప్రోచ్ అవడం తగ్గించారు నిర్మాతలు, దర్శకులు. అలాంటి సమయంలోనే ‘క్రాక్’ రూపమ్లో సాలిడ్ హిట్ అందుకుంది శృతి హాసన్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మరోసారి లక్కీ లేడీ అనిపించుకుంది. ఈ సినిమా హిట్టవడంతోనే ఆమెకు ప్రభాస్, ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘సలార్’లో అవకాశం దక్కింది. ఈ సినిమాకు ఆమెకు పారితోషకం భారీగానే ముట్టినట్టు తెలుస్తోంది. ఇదిదీనికంటే ముందే ఆమె పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ చేసింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘క్రాక్’ సినిమాతోనే శృతి తన రెమ్యునరేషన్ పెంచేసిందట. ఇక ‘వకీల్ సాబ్, సలార్’ చిత్రాలు గనుక విజయం సాధిస్తే శృతిని అందుకోసం మామూలు నిర్మాతలకు అయ్యే పని కాదంటున్నారు.