బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న సినిమా స్త్రీ 2 చిత్రంలో కీలక పాత్ర పోషించింది శ్రద్ధా కపూర్. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు రికార్డ్ బద్దలుకొడుతుంది..
అయితే ఓవైపు తన సినిమా కోట్లు కొల్లగొడుతుంటే.. మరోవైపు హీరోయిన్ మాత్రం అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అవుతుందట. ఈ విషయం తెలిసి అందరు అవాక్కవుతున్నారు. స్త్రీ2 మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నశ్రద్ధా కపూర్..ముంబైలోని జుహులో ప్రస్తుతం హృతిక్ రోషన్ ఉంటున్న ఇంటినే అద్దెకు తీసుకోబోతోంది. దీనికోసం ఆమె నెలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు అద్దె చెల్లించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి..!!