చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన రష్మిక మందాన ఆ తర్వాత కెరీర్లో వెనక్కి చూసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి హీరోయిన్ రష్మిక సినిమాలు చేసింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్పలో నటించిన రష్మిక… పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్లింది. ఈ సినిమా తర్వాతేనే బాలీవుడ్లో అడుగుపెట్టిన రష్మిక..అక్కడ కూడా ఫుల్ బిజీగా ఉంది. ఇది ఇలా ఉండగా హీరోయిన్ రష్మికకు తాజాగా ఊహించని పరిణామం ఎదురైంది. సింపుల్గా చెప్పాలంటే రష్మికకు ఇది ఘోర అవమానం అని చెప్పవచ్చు.
Shraddha Kapoor Intentionally IGNORES Rashmika Mandanna?
వినాయక చవితి సందర్భంగా అంబానీ కుటుంబంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి టీమిండియా క్రికెటర్లు, బాలీవుడ్ తారలు, టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ప్రభాస్ హీరోయిన్ అయిన శ్రద్ధ… అక్కడికి వచ్చింది. శ్రద్ధ రావడం గమనించిన రష్మిక ఆమెను పలకరించేందుకు ఒక నిమిషం ఆగింది. అయితే శ్రద్ధ మాత్రం రష్మికను అస్సలు పట్టించుకోలేదు. అది చూసి ఒక్క నిమిషం షాక్ అయిన రష్మిక… వెంటనే చేరుకొని మళ్ళీ ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!