in

Sherlyn Chopra exposed drug consumption at Shah Rukh Khan’s party!

షారుఖ్ ఖాన్‍కు సొంతంగా కోల్ కత్తా నైట్ రైడర్స్ పేరుతో సొంతంగా ఐపీఎల్ జట్టు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఓ మ్యాచ్‏లో షెర్లిన్ డ్యాన్స్ చేసింది. తాను డ్యాన్స్ చేసిన తర్వాత అక్కడ కొన్ని షాకింగ్ దృశ్యాలను చూశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా ఆ ఇంటర్వ్యూ క్లిప్‏ను షేర్ చేసింది షెర్లిన్. అందులో షెర్లిన్ మాట్లాడుతూ.. డ్యాన్స్ చేసి అలసిపోయిన తర్వాత నేను వాష్ రూంకు వెళ్లాను. అక్కడ డోర్ ఓపెన్ చేయగానే.. కనిపించిన దృశ్యాలను చూసి షాకయ్యాను.

నేను తప్పు ప్లేస్‏కు వచ్చానా ? అనిపించి.. ఒక్క క్షణం నా మైండ్ పనిచేయలేదు. ఆ తర్వాత విషయం అర్థమైంది. అక్కడున్న స్టార్ల భార్యలు.. వాష్ రూం అద్దాల ముందు నిల్చుని తెల్లని పౌడర్ పీలుస్తున్నారు. వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని నాకు అర్థమైంది. ఒక్కొక్కరూ సైకోలా ప్రవర్తిస్తున్నారు. వారిని చూసి ఓ నవ్వు నవ్వి అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత షారుఖ్ ఖాన్‏కు.. అతని స్నేహితులకు గుడ్ బై చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే పార్టీలో ఎలాంటివో నాకు ఆరోజే అర్థమైంది అంటూ చెప్పుకొచ్చింది షెర్లిన్.

natudiga 50 vasanthalu poorthy chesukunna victory venkatesh!

regina cassandra at hyderabad fitathlon marathon event!