in

natudiga 50 vasanthalu poorthy chesukunna victory venkatesh!

విక్టరీ వెంకటేష్ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు అయింది. ఏమిటి ఆశ్చర్య పోతున్నారా ? సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన ” ప్రేమ నగర్” చిత్రం సెప్టెంబర్ 24 , 1971 లో రిలీజ్ అయింది, ప్రేమ నగర్ కు వెంకటేష్ గారికి లింకేంటి అనుకుంటున్నారా, ఆయన నిర్మాత కొడుకే కాదు ఆ చిత్రంలో నటించారు కూడా. అప్పుడు వెంకటేష్ గారు స్కూల్ చదువుతున్నారు, లంచ్ బ్రేక్ లో డ్రైవర్ వచ్చి నాన్న గారు షూటింగ్ స్పాట్ కి రమ్మంటున్నారు అని తీసుకొని వెళ్ళాడు. వెంకటేష్ గారు స్పాట్ కి వెళ్ళగానే రామ నాయుడు గారు, ఆయనకు డ్రెస్ వేసి,డైలోగ్స్ చెప్పి, యాక్ట్ చేయమని చెప్పారట,

ఏమాత్రం భయమా, బెరుకు లేకుండా యాక్ట్ చేశారట, ఎందుకంటె ఆ రోల్ చేస్తే 1000 రూపాయలు అకౌంట్ లో వేస్తాను అన్నారట రామ నాయుడు గారు. ఆ రోజుల్లో అది చాల భారీ పాకెట్ మనీ కాబట్టి, ప్రేమ్ నగర్ మూవీ లో చిన్న నాటి సత్యనారాయణ గారి క్యారెక్టర్ లో నటించేసారు వెంకటేష్ గారు. అందుకే వెంకటేష్ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు గడచిపోయాయి అని చెప్పింది. సో ఇప్పుడు మీరు కూడా ఒప్పుకుంటారు అని అనుకుంటాను.

Prabhas Joins Hands With Sandeep Reddy Vanga for ‘Spirit’!

Sherlyn Chopra exposed drug consumption at Shah Rukh Khan’s party!