in

Prabhas Joins Hands With Sandeep Reddy Vanga for ‘Spirit’!

ప్రభాస్ 25వ సినిమా అనౌన్స్‏మెంట్ వచ్చేసింది.. ప్రభాస్ 25వ సినిమా కు స్పిరిట్ అనే టైటిల్ ఖరారు. దర్శకుడుగా సందీప్ రెడ్డి వంగా. టి సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాత. అధికారికంగా ఎనౌన్స్ చేసిన మేకర్స్. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్న నిర్మాతలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ పూర్తి చేసిన డార్లింగ్.

మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగ్‍లోనూ… బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రీకరణలోనూ పాల్గోంటున్నాడు. అంతేకాకుండా.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవల్లో కావడం మరో విశేషం. దీంతో ప్రభాస్ స్పీడ్ చూసి.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం షాకవుతున్నారు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ.. మరోవైపు వరుస ప్రాజెక్ట్‏లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ… బిజీ షెడ్యూల్‏ గడిపేస్తున్నాడు ప్రభాస్.

ఇవే కాకుండా.. ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియాను మించి ఉండబోతుందని గతంలోనే నాగ్ అశ్విన్ ప్రకటించాడు. దీంతో ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సలార్, ఆదిపురుష్ సినిమాల తర్వాత.. ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. తాజాగా ఆయన తన 25వ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు.

varshini at exquisite diva galleria jewellery showcase!

natudiga 50 vasanthalu poorthy chesukunna victory venkatesh!