in

sharwanand to romance young beauty ashika ranganath!

శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా ఆషికా రంగనాథ్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ సరసన నటించి ఆకట్టుకుంది ఆషికా రంగనాథ్. మరోవైపు శర్వానంద్ ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ పై కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది. కాగా గోపీచంద్ హీరోగా వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట..

ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. అలాగే, హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు కూడా చాలా కామెడీగా సాగుతాయని..సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా మొదలు అవుతుందట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది..!!

Actress Avika Gor Clarity on Plastic Surgery Rumors!

anchor anasuya removed from 3 movies overnight!