
ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది..
“నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వాస్తవమే. కానీ, అది అందం కోసం చేయించుకున్న సర్జరీ కాదు..కేవలం నా ముఖంపై ఉన్న పింపుల్స్ తగ్గించుకోవడానికి మాత్రమే. దురదృష్టవశాత్తూ అది కూడా సరిగా పనిచేయలేదు” అని వెల్లడించింది. నటిగా స్క్రీన్‌పై ప్రెజెంటబుల్‌గా కనిపించడం ముఖ్యం కాబట్టి, అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు పార్లర్‌కు వెళ్లి బ్లడ్ సెల్స్ క్లీనింగ్, బైఫిషియల్ లాంటి సాధారణ ఫేషియల్స్ చేయించుకునేదాన్ని తప్ప ఎలాంటి కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోలేదని స్పష్టం చేసింది..!!
