ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం “జైలర్” చిత్రం వరల్డ్ వైడ్ భారీ వసూళ్లతో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో కూడా సెన్సేషనల్ వసూళ్లు కొల్లగొడుతూ ఉండగా యూఎస్ లో కూడా ఈ చిత్రం 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు అందుకుంది. దీనితో ఈ చిత్రం తర్వాత రజినీకాంత్ హీరోగా చేయనున్న సినిమాలు పై మరిన్ని అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఈ చిత్రాల్లో దర్శకుడు టి జి జ్ఞ్యానవేల ముత్తు అయితే చేయనున్న ఓ భారీ మల్టీ స్టారర్ కూడా ఒకటి..
కాగా ఈ చిత్రంలో అయితే అమితాబ్ బచ్చన్ నాని లాంటి వారు ఉండగా ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టుగా టాక్ వచ్చింది. అయితే ఈ పాత్రపై ఓ క్రేజీ టాక్ ఇప్పుడు సినీ వర్గాలు నుంచి వినిపిస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్ అయితే రజినీకి ఆపోజిట్ గా విలన్ పాత్రలో నటిస్తున్నట్టుగా అంటున్నారు. మరి ఇదైతే అసలు ఊహించనిది అని చెప్పాలి. రజినీ ఏంటి రజినీకి విలన్ గా ఈ కుర్ర హీరో ఏంటి..ఇది మాత్రం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పాలి. మరి అసలు తాను ఈ చిత్రంలో ఎలా కనిపిస్తాడా అనేది చూడాలి. కాగా ఈ చిత్రం అయితే ఈ రెండు నెలల్లో స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది..!!