in

senior heroine rambha’s surprise in ‘maha samudram’!

90ల‌లో త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారుకు నిద్ర‌పట్ట‌కుండా చేసింది అందాల భామ రంభ‌. స్టార్ హీరోల‌తో పోటీ ప‌డి మ‌రీ యాక్టింగ్‌, డ్యాన్స్ చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెండ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూరమైంది. రంభ అభిమానుల జాబితాలో జ‌గ‌ప‌తిబాబు కూడా ఉన్నారు. అవును మీరు విన్న‌ది నిజ‌మే.కానీ రియ‌ల్ లైఫ్ లో కాదు..రీల్ లైఫ్ లో. ఆర్ ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తున్న చిత్రం మ‌హాస‌ముద్రం,

శ‌ర్వానంద్, సిద్దార్థ్‌, అదితీరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు కీ రోల్ లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో జ‌గ్గూభాయ్ రంభ‌కు అభిమానిగా క‌నిపిస్తాడు. వైజాగ్ లో వేసిన సెట్‌లో జ‌గ్గూభాయ్ పై ఓ పాట‌ను షూట్ చేయ‌గా..ఈ సాంగ్‌లో రంభ ఫొటోలు, ప్లెక్సీలు క‌నిపిస్తాయి. ఈ పాట‌లో శ‌ర్వానంద్ కూడా ఉంటాడు. అంతేకాదు ఈ పాట కోసం డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి రంభ అనుమ‌తి కూడా తీసుకున్నాడ‌ట‌.

Payal Rajput goes back to Punjabi film industry!

bommarillu beauty genelia ready for re entry in tollywood?