in

Payal Rajput goes back to Punjabi film industry!

RX100 సినిమాలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి నటనను కనబరిచి మెప్పించింది పంజాబీ సుందరి పాయల్‌ రాజ్‌పుత్‌. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించడంతో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు వరుసకట్టాయి. తొలినాళ్లలోనే వెంకటేష్‌, రవితేజ వంటి అగ్ర కథానాయకులతో జోడీకట్టిన ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసిరాలేదు. పరాజయాల కారణంగా కొంతకాలంగా తెలుగులో ఆమె జోరు తగ్గిపోయింది.

తిరిగి మాతృభాష పంజాబీపై దృష్టిపెట్టింది ఈ ముద్దుగుమ్మ. రెండేళ్ల విరామం తర్వాత పంజాబీ చిత్రసీమలో పునరాగమనం చేయబోతున్నది పాయల్‌ రాజ్‌పుత్‌. పంజాబీ అగ్ర కథానాయకుడు గిప్పిగ్రేవాల్‌తో ‘శావనిగిర్‌ధరిలాల్‌’ అనే సినిమా చేయబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించింది. ‘ఎంచుకునే ప్రతి కథ నటిగా నాకో సవాల్‌ విసిరేలా ఉండాలి. అలాంటి చాలెంజింగ్‌ రోల్‌ను ఈ సినిమాలో చేయబోతున్నా’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ తెలిపింది..

ismart beauty gets a call from koratala for ntr’s next!

senior heroine rambha’s surprise in ‘maha samudram’!