ఎంత బోయపాటి శ్రీనుతో బాలయ్య జోడీ కట్టినప్పటికీ మరీ ఇంత క్రేజా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. టీజర్ మరీ సెన్సేషనల్‌గా కూడా ఏమీ లేకపోవడంతో ఈ వ్యూస్ వెనుక సీక్రెట్ ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు జనాలు. తద్వారా తెలిసిందేమంటే.. ఈ టీజర్‌ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేస్తుండటం వల్లే వ్యూస్ ఈ స్థాయిలో వస్తున్నాయట. అందుకోసం చాలా ఖర్చు పెట్టారట నిర్మాత. ఈ రోజుల్లో టీజర్,
ట్రైలర్‌లకు వచ్చే స్పందనను బట్టి కూడా సినిమాలకు బిజినెస్ జరుగుతోంది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌కు తోడు.. టీజర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయితే సినిమాకు బిజినెస్ పరంగా కలిసొస్తుందని నిర్మాత బాగా ఖర్చు పెట్టి టీజర్‌ను ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే అఖండ టీజర్‌కు ఆ వ్యూస్ అని అంటున్నారు. బాలయ్య గత సినిమాల టీజర్లు, ట్రైలర్కు వచ్చిన వ్యూస్.. అఖండ టైటిల్ రోర్‌కు వచ్చిన వ్యూస్ పోల్చి చూస్తే ఇది నిజమే అనిపించకమానదు.