in

Samuthirakani confirms his role in pawan kalyan’s next!

2020లో అల వైకుంఠ‌పురం చిత్రంతో సంక్రాంతి హిట్‌, 2021లో క్రాక్ సినిమాతో మ‌రో సంక్రాంతి హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు స‌ముద్ర‌ఖ‌ని. ఈ రెండు చిత్రాలు న‌టుడిగా స‌ముద్ర‌ఖ‌నిని మ‌రోస్థాయికి తీసుకెళ్లాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ న‌టుడికి ఇపుడు ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులో న‌టించే అవ‌కాశాలు వెతుక్కుంటూ మ‌రీ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ లో న‌టిస్తున్నాడు.

ఇపుడు మ‌రే క్రేజీ మూవీలో న‌టించే ఛాన్స్ కొట్టేశాడు. క్రాక్ ప్ర‌మోష‌న్స్ లో స‌ముద్ర‌ఖ‌ని మాట్లాడుతూ..ప‌వ‌న్ క‌ల్యాణ్-రానా కాంబినేష‌న్ లో వ‌స్తున్న అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ లో ఓ పాత్ర చేస్తున్నాన‌ని చెప్పాడు. సినిమాలో నా క్యారెక్ట‌ర్ గురించి అంత‌గా తెలియదు. త్రివిక్ర‌మ్ నాకు ఫోన్ చేసి సినిమాలో నీకోసం ఓ మంచి పాత్ర డిజైన్ చేశాన‌ని చెప్పార‌ని స‌ముద్ర‌ఖ‌ని చెప్పుకొచ్చాడు. సాగ‌ర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండ‌గా..త్రివిక్ర‌మ్ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు చూస్తున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.

ravi teja reveals about his first remuneration!

prabhas – prashanth neel ‘salaar’ movie officially launched!