in

prabhas – prashanth neel ‘salaar’ movie officially launched!

స్టార్ హీరో ప్ర‌భాస్ కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం స‌లార్‌. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ లో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హోంబ‌లే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత‌ విజ‌య్ కిరగండూర్, కేజీఎఫ్ ఫేం య‌శ్, ప్ర‌భాస్ తోపాటు ప‌లువురు సినీ, రాజకీయ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన హోంబ‌లే ఫిలిమ్స్  విజ‌య్‌ కిర‌గండూర్, ప్ర‌భాస్ సార్ కు ధ‌న్య‌వాదాలు. ఈ రోజు మాతో ఉన్నందుకు నా రాకీ (య‌శ్‌)కు ధ‌న్య‌వాదాలు.

స‌లార్ మిమ్మ‌ల్ని నిరాశ‌ప‌ర్చ‌దు. మాకు మీ ప్రేమ, మ‌ద్ద‌తు అందిస్తున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలు అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ నీల్ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం రాధేశ్యామ్ తోపాటు స‌లార్, ఆదిపురుష్ చిత్రాల‌తో ‌న‌టిస్తున్నాడు ప్ర‌భాస్‌. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న చిత్రం స‌లార్. స‌‌లార్ జ‌న‌వరి చివ‌రి వారం నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశాప‌టానీని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశ‌మున్న‌ట్టు తెలుస్తున్నా..అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Samuthirakani confirms his role in pawan kalyan’s next!

I Don’t Know How To Swim, But I Played A Swimmer : nabha!