in

Samantha Tops IMDb’s Popular Indian Celebrities list!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కి పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల అందరిని వెనక్కి నెట్టి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ లిస్టులో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఐడిఎంబి( ఇండియన్ మూవీ డేటాబేస్) విడుదల చేసిన ఈ లిస్టులో సమంత తొలి స్థానంలో నిలిచింది. ఐడిఎంబి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల స్పందనను బట్టి ర్యాంకింగ్స్ విడుదల చేస్తుంటారు.

అలా తాజాగా ఇచ్చిన ర్యాంకింగ్స్ లో సామ్.. ఫస్ట్ ప్లేస్ సాధించింది. ఇంతకుముందు ర్యాంకింగ్స్ విడుదల చేసినప్పుడు 9వ స్థానంలో ఉన్న సమంత ఇప్పుడు అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ లిస్టులో పూజ హెగ్డే 5 వ స్థానంలో ఉంది. అల్లు అర్జున్ 17వ స్థానంలో ఉన్నాడు. దుల్కర్ సల్మాన్ 36, భూమిక చావ్లా37, డైరెక్టర్ మణిరత్నం 46వ స్థానాల్లో నిలిచారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, దీపికా పదుకొనే వంటి బాలీవుడ్ స్టార్లు ఈ లిస్టులో చెప్పుకోదగ్గ స్థానంలో లేకపోవడం గమనార్హం..!!

AR Rahman onboard for Ram Charan’s next!

Kajal to do another lady oriented thriller!