in

Kajal to do another lady oriented thriller!

టాలీవుడ్ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకామె. అయితే తన ఎరా నడిచిన కాలంలో భారీ ఆఫర్స్ సొంతం చేసుకొని క్రేజ్ తో పాటుగా క్యాష్ కూడా చేసుకుంది. మరి ఒక స్టేజ్ కి వచ్చేసాక పెళ్లి చేసేసుకున్న కాజల్ ఇక ఈ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. కాగా ఈ ఇన్నింగ్స్ లో రీసెంట్ గా అయితే గోష్ఠి సినిమాతో పలకరించగా అది పెద్దగా ఆడలేదు. దీనితో పాటుగా బాలయ్య సినిమాలో అయితే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అయితే ఇప్పుడు ఉన్న టైం లో ఇతర హీరోయిన్స్ తో పోలిస్తే కాజల్ నుంచి లేడీ ఓరియెంటెడ్ జానర్ లో చాలా తక్కువ సినిమాలే కనిపిస్తాయని చెప్పాలి..

రీసెంట్ గోష్ఠి అప్పుడెప్పుడో ఓ వెబ్ సిరీస్ ని తాను చేసింది. అలాగే “ఉమా” అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాని అయితే తాను ఓకే చేయగా ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకి అయితే కాజల్ ఓకే చెప్పినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఉన్న సమయంలో సింగిల్ గా కాజల్ మార్కెట్ అంతగా లేనే లేదు. ఈ తరహా సినిమాలతో గట్టెక్కడం అంటే కష్టమే అని చెప్పాలి. మరి కాజల్ అగర్వాల్ ఈ జానర్ లో ఇతర హీరోయిన్స్ అనుష్క, సమంత, కీర్తి సురేష్ లా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి..!!

Samantha Tops IMDb’s Popular Indian Celebrities list!

dimple hayathi wants a golden temple from fans!