పుష్ప లో ఐటెం సాంగ్ చేశాక మరింత బిజీ అయిపోయిన సమంతాకు ఆఫర్లు మాత్రం ఆగడం లేదు. ఒకపక్క సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇండిపెడెంట్ ఫిలింస్, టాక్ షోలు, ఇంటర్వ్యూలు ఇలా అన్ని రకాలుగా బిజీగా మారిపోయింది. త్వరలో తమిళంలో రూపొందబోయే విజయ్ సినిమాలో తనే హీరోయిననే ప్రచారం చెన్నై మీడియాలో జోరుగా సాగింది. విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో స్కై హైలో ఉన్న లోకేష్ కనగరాజ్ దీనికి దర్శకుడు. ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు కానీ వారసుడు పూర్తయ్యేలోపు లోకేష్ స్క్రిప్ట్ ఫైనల్ చేసేయాలి. ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. అందరూ అనుకున్నట్టు సామ్ ఇందులో హీరోయిన్ కాదట..
నెగటివ్ షేడ్స్ లో సాగే పోలీస్ ఆఫీసర్ గా చాలా కొత్తగా కనిపించనుందట. పాత్ర తీరుతెన్నులు చెప్పగానే సమంతా ఆల్మోస్ట్ ఓకే చేసినట్టు సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆల్రెడీ చేసిన అనుభవం ఉంది. అందులో ఆడియన్స్ తనను బాగా రిసీవ్ చేసుకున్నారు. సో విలన్ టచ్ ఉన్న క్యారెక్టర్ కొత్తేమి కాదు. అయితే నరసింహలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి అంత వెయిటేజ్ ఉంటేనే ఇలాంటివి కెరీర్ పరంగా ఉపయోగపడతాయి..విజయ్ తో గతంలో సామ్ మూడుసార్లు జోడిగా నటించింది. కత్తి, పోలీసోడు, అదిరింది మూడు తమిళంలో ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్లు..