ఫ్యామిలీమాన్-2’ వెబ్ సిరీస్ తో తన హిందీ అరంగేట్రం గురించి సమంత మాట్లాడుతూ ‘బాలీవుడ్‌లో అద్భుతమైన ప్రతిభ కలిగిన నటీనటులున్నారు. వారితో పోటీపడి రాణించగలనా?లేదా? అనే భయాలు నాలో ఉండేవి. అందుకే గతంలో ఎన్నో అవకాశాలు వచ్చినా తిరస్కరించాను. వెబ్‌సిరీస్‌లో దర్శకద్వయం రాజ్ డీకే నా పాత్రను ఉన్నతంగా తీర్చిదిద్దారు. అది నచ్చే నటించడానికి అంగీకరించా.
ట్రైలర్‌కు వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే విడుదలకు ముందే నా పాత్ర విజయవంతమైందనే అనుభూతి కలుగుతోంది’ అని చెప్పింది. అలాగే ఈ సిరీస్‌లో మనోజ్‌బాజ్‌పాయ్ పోషించిన పాత్రను తెలుగులో ఎవరూ చేస్తే బాగుంటుందని సమంతను అడిగితే.. మామయ్య నాగార్జున అంటూ టక్కున సమాధానమిచ్చింది. హిందీలో రణ్‌భీర్‌కపూర్‌తో రొమాంటిక్ సినిమా చేయాలన్నది తన కల అని వెల్లడించింది. ‘ఫ్యామిలీమాన్-2’ వెబ్‌సిరీస్ జూన్ 4న విడుదలకానుంది.