in

pooja hegde’s sweet gesture to harish shankar!

బుట్టబొమ్మ పూజాహెగ్డే తన అభిమాన చిత్రనిర్మాతలకు “స్వీట్” సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తన స్వస్థలమైన మంగుళూరు నుంచి తెప్పించిన రుచికరమైన మామిడిపండ్లను చిత్ర పరిశ్రమ ప్రముఖులకు పంపుతోంది. ఇప్పటికే ఈ మామిడి పండ్లను త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, మరికొంత మంది ప్రముఖులకు పంపినట్లు తెలిసింది. తాజాగా హరీష్ శంకర్ ఈ విషయాన్నీ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

“ఈ స్వీట్ గెస్చర్ కు ధన్యవాదాలు” అంటూ పూజాహెగ్డే చేసిన పంపిన మామిడిపండ్లతో పాటు మెసేజ్ ను కూడా షేర్ చేసుకున్నారు. అందులో పూజ “హలో సర్! నా స్నేహితుడి పొలంలో పండించిన ఈ రుచికరమైన, సేంద్రీయ మామిడి పండ్లను ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అంతా బాగానే ఉందని ఆశిస్తున్నాను. త్వరలో కలుద్దాం!! లవ్, పూజా హెగ్డే” అంటూ రాసుకొచ్చింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన “గద్దలకొండ గణేష్” చిత్రంలో పూజాహెగ్డే ఓ కీలకపాత్రలో కన్పించిన విషయం తెలిసిందే.

GHANTASALA PAATA PAaDANI VIJAYA VARI YEKAIKA CHITRAM!

Samantha REVEALS she would like to romance Ranbir Kapoor!