
తమిళ స్టార్ బ్యూటీ నయనతార ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. ఆమె సౌత్‌లో ‘టాక్సిక్’ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో నటిస్తూనే నార్త్‌లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమాలో కూడా నటిస్తుంది. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, నయన్‌కు బాలీవుడ్‌లో ఇది రెండో సినిమా..
తొలిసారి బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘జవాన్’ సినిమాలో నటించిన నయనతార, ఆ సినిమాలో పూర్తి యాక్షన్ సీక్వెన్స్‌లతో ఇరగదీసింది. అయితే, ఇప్పుడు మరోసారి సల్మాన్ సినిమాలో కూడా యాక్షన్‌కే ప్రాధాన్యత ఉన్న పాత్రలో నయన్ కనిపిస్తుందని తెలుస్తోంది. అప్పుడు షారుఖ్ సినిమాలో, ఇప్పుడు సల్మాన్ సినిమాలో నయనతార యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తుండటంతో ఆమెకు బాలీవుడ్ జనాలు కూడా ఫిదా అవుతున్నారు. ఇక సల్మాన్ ఖాన్ సినిమాను వచ్చే ఏడాది ఈద్‌కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..!!
