మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో ఆమె బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె అనేక రకాల వైద్యాలను ప్రయత్నిస్తున్నారు. ఆయుర్వేదం, హోమియో, టిబెటన్ మెడిసన్, ప్రాణిక్ హీలింగ్ లాంటి వాటిని ప్రయత్నిస్తూ వస్తున్నారు. బోలెడు డబ్బును సైతం ఖర్చు పెడుతున్నారు. ఇటీవల ఆమె పరిస్థితి కాస్త మెరుగైనట్లే ఉంది. అందుకనే ఆమె ఓ ట్రీట్మెంట్ వివరాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. అయితే ఈ విషయమై ఓ డాక్టర్ మాత్రం ఘాటుగా స్పందించారు.
కొన్ని డేంజరస్ వైద్య పద్ధతులను పబ్లిక్‌గా చెప్పడం సరికాదని అన్నారు. మిస్ ఇన్ఫర్మేషన్లను పాస్ చేయడం తప్పని అన్నారు. ఈ విషయమై తాను సమంతను జైల్లో పెట్టిస్తానంటూ పోస్ట్ చేశారు. సమంత కూడా ఈ విషయంలో ఘాటుగానే స్పందించారు. అందరి దగ్గరా డబ్బు ఎక్కువగా ఉండదు. కాబట్టి నా ట్రీట్మెంట్ వివరాలు ఎవరికైనా ఉపయోగ పడతాయన్న ఉద్దేశంతోనే తాను ఇలా పబ్లిక్‌గా సమాచారాన్ని పంచుకున్నానని అన్నారు. అయితే ఈ ట్రీట్మెంట్ తన డాక్టర్ పర్యవేక్షణలో జరిగిందని అన్నారు. ఇలా తనకు వార్నింగ్ ఇచ్చే బదులు, తన డాక్టర్‌తో డిబేట్‌కి వచ్చి ఉంటే బాగుండేదని చెప్పారు..!!